బన్నీ సినిమాకు బాలీవుడ్ లో సీక్వెల్?

Published on Aug 9, 2020 7:19 pm IST

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా పరుగు. ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.కాగా ఈ సినిమా బాలీవుడ్ లో హీరో పంతి అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది. నటుడు జాకీ ష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ ఈ సినిమాతో బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. అక్కడ కూడా ఈ సినిమా హిట్ దక్కించుకుంది.

కాగా ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కించాలని సన్నాహాలు జరుగుతున్నాయి. టైగర్ కూడా ఈ సినిమా సీక్వెల్ కు ఒకే చెప్పాడట. చిత్ర యూనిట్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో బన్నీ గెస్ట్ రోల్ చేస్తే బాగుంటుందని ఆ మూవీ మేకర్ సాజిద్ డైరెక్టుగా బన్నీని అప్రోచ్ అయ్యినట్లు టాక్ వినిపిస్తోంది. మరి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. మరో వైపు తెలుగులో కూడా ‘పరుగు’ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని నిర్మాత దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .

సంబంధిత సమాచారం :

More