మహేష్ కోసం క్రేజీ టైటిల్?

Published on May 27, 2020 4:54 pm IST

మరికొద్దిరోజులలో మహేష్ నెక్స్ట్ మూవీపై స్పష్టత రానుంది. దర్శకుడు పరుశురాం తో మహేష్ తన తదుపరి చిత్రం చేస్తుండగా దీనికి సంబందించిన అధికారిక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కానుకగా మే 31న వెలువడనుంది. దీనితో మహేష్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. పరుశురాం ఇప్పటికే మహేష్ తో మూవీ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే మహేష్ ఇమేజ్ కి తగ్గట్టుగా మంచి కమర్షియల్ మాస్ సబ్జెక్టు తో స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు చెప్పారు.

కాగా పరుశురాం ఈ మూవీ కోసం ఓ క్రేజీ టైటిల్ కూడా అనుకుంటున్నారట. మహేష్ గత చిత్రాలకు భిన్నంగా సరికొత్తగా ఈ టైటిల్ ఉండనుందని వినికిడి. మరి మహేష్ కోసం పరుశురాం ఎలాంటి టైటిల్ అనుకున్నారో చూడాలి. ఇక మహేష్ గత చిత్రం సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ అందుకోగా, పరుశురాం గత చిత్రం గీత గోవిందం సంచలన విజయం నమోదు చేసింది. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రంపై ఫ్యాన్స్ లో అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం :

More