మహేష్ ఫ్యాన్స్ కి భారీ ట్రీట్ లా పరుశురాం స్క్రిప్ట్..!

Published on May 1, 2020 3:32 pm IST

మహేష్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ మూవీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకున్నప్పటికీ ఆయన దర్శకుడు పరుశురాం తో కమిట్ అయినట్లు తెలుస్తుంది. డైరెక్టర్ పరుశురాం ఇంత వరకు ఓ స్టార్ హీరోతో మూవీ చేయలేదు. ఆయన డైరెక్షన్ లో పనిచేసిన అతిపెద్ద హీరో రవితేజ. ఆయనతో పరుశురాం తెరకెక్కించిన ఆంజనేయులు, సారొస్తారు రెండు విజయం సాధించలేదు. దీనితో మహేష్ ని పరుశురాం హ్యాండిల్ చేయగలడా అనే డౌట్ ఫ్యాన్స్ లో మొదలైంది.

ఐతే ఫ్యాన్స్ కి కావలసిన అంశాలతో మహేష్ ఇమేజ్ కి సరిపోయేలా పరుశురాం ఓ బెస్ట్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంచారట. ఇక గతంలో మహేష్ బాబు సినిమాలలో వలె ఇందులో సోషల్ మెస్సేజ్ వంటి అంశాన్ని కూడా టచ్ చేయకుండా ప్యూర్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా పరుశురాం తెరకెక్కించనున్నాడట. యాక్షన్ మరియు డైలాగ్స్ అలాగే గ్లామర్, హ్యూమర్ కలిగిన పక్కా మాస్ ఎంటర్టైనర్ గా పరుశురాం తెరకెక్కిస్తారట.

సంబంధిత సమాచారం :