సంక్రాంతి వెళ్ళిన వారం రోజుల తర్వాత థియేటర్ల వద్ద దీపావళి తీసుకొచ్చారు నందమూరి కళ్యాణ్ రామ్. వరుస పరాజయాల తర్వాత ఈ నందమూరి హీరో నటించిన ‘పటాస్’ గట్టిగా పేలింది. థియేటర్లలో రీ సౌండ్ వస్తుంది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తీసుకొస్తుంది. విడుదలైన తొలి వారంతంలో (ఓపెనింగ్ వీకెండ్) 8 కోట్లను వసూలు చేసిందని సమాచారం. తర్వాత కూడా సినిమా కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. నైజాంలో సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విజయంతో సంతోషంగా ఉన్నారు. దర్శకుడిగా అనిల్ రావిపూడికి ఇది తొలి సినిమా అయినా, కమర్షియల్ కొలతలు పాటిస్తూ పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ అందించాడు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతి సోది హీరోయిన్. సాయి కుమార్, అసుతోష్ రాణా, శ్రీనివాస రెడ్డి, ఎమ్మెస్ నారాయణ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీత దర్శకుడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను స్వయంగా నిర్మించారు.


