
‘పటాస్’ సినిమాతో బారి హిట్ పై కన్నేశాడు నందమూరి కళ్యాణ్ రామ్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పోలీస్ పాత్రలో నటించారు. రోజు రోజుకి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ పెరుగుతుంది. సినిమా చూసిన ఇండస్ట్రీ ప్రముఖులు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా గ్యారెంటీ హిట్ అని చెప్తున్నారు. జనవరి 23న సినిమా విడుదలవుతుంది. సినిమా క్రేజ్ దృష్ట్యా ఆ రోజు ఉదయం నందమూరి అభిమానులు ప్రీమియర్ షో ప్లాన్ చేశారు.
డిసెంబర్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ సోదరుడు నందమూరి జానకి రామ్ ఆకస్మిక మృతితో జనవరికి వాయిదా పడింది. అయినా, యాంగ్రీ యంగ్ మాన్ లుక్ లో కళ్యాణ్ రామ్ ను చూపిస్తూ విడుదల చేసిన ఈ సినిమా యాక్షన్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించారు. శృతి సోది హీరోయిన్ గా పరిచయం అవుతుంది. పాపులర్ రైటర్ అనిల్ రావిపూడి ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.

