ఇంటర్వ్యూ : అనిల్ రావిపూడి – నందమూరి అభిమానులకు పండగ తీసుకొచ్చే ‘పటాస్’

ఇంటర్వ్యూ : అనిల్ రావిపూడి – నందమూరి అభిమానులకు పండగ తీసుకొచ్చే ‘పటాస్’

Published on Jan 21, 2015 1:11 PM IST

Anil-Ravipudi-
నందమూరి కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్న ‘పటాస్’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు ప్రముఖ రచయిత అనిల్ రావిపూడి. శృతి సోది హీరోయిన్. సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందకు వస్తున్న ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి దర్శకుడు మీడియాతో సమావేశం అయ్యారు. ఆ వివరాలు మీకోసం ..

ప్రశ్న) మీ గురించి చెప్పండి. ఇండస్ట్రీకి ఎప్పుడు వచ్చారు..?

స) 2005లో విడుదలైన ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’ సినిమాకు సహాయ దర్శకుడిగా పని చేశాను. అదే నా తొలి సినిమా. ‘శౌర్యం’తో రచయితగా మారాను. ‘శంఖం’, ‘అలా మొదలైంది’, ‘కందిరీగ’, ‘మసాలా’ సినిమాలకు రచయితగా పని చేశాను. ఇప్పుడు ‘పటాస్’తో దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను.

ప్రశ్న) ‘పటాస్’ సినిమా అవకాశం ఎలా వచ్చింది..?

స) 2012లో ఈ సినిమా కథ రెడీ చేశాను. కళ్యాణ్ రామ్ గారు ‘ఓం’ షూటింగ్ చేస్తున్న సమయంలో కథ వినిపించాను. ఆయనకు బాగా నచ్చింది. ‘ఓం’ షూటింగ్ లో బిజీగా ఉండడంతో కళ్యాణ్ గారు.. నేను ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తాను, ఓ పెద్ద హీరోతో సినిమా చేద్దాం అన్నారు. మీ కోసం కథ రెడీ చేశాను అని చెప్పాను. మధ్యలో ‘మసాలా’ సినిమాకు రచయితగా పని చేశాను. ఓ ఏడాది తర్వాత ఫైనల్ గా ‘పటాస్’ పట్టాలు ఎక్కింది.

ప్రశ్న) హీరోగా, నిర్మాతగా కళ్యాణ్ రామ్ గారి సహకారం ఎలా ఉంది..?

స) సినిమా ప్రారంభమైన మొదటి రోజు నుండి నేటి వరకు ఆయన సహకారం మరువలేనిది. నన్ను, కథను నమ్మారు. ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్లో అద్బుతంగా నటించారు. నందమూరి అభిమానులకు సంక్రాంతి తర్వాత మరో పండగ ‘పటాస్’ తీసుకొస్తుంది.

ప్రశ్న) ‘పటాస్’ సినిమా కథ ఏంటి..?

స) అవినీతిపరుడైన పోలీస్ ఆఫీసర్ నిజాయితిపరుడిగా ఎలా మారాడు అనేది సినిమా కథ. హీరో క్యారేక్టరైజేషన్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. విలన్, హీరో మధ్య సన్నివేశాలు హైలైట్ అవుతాయి.

ప్రశ్న) ఇప్పటివరకు తెలుగు తెరపై చాలా పోలీస్ కథలు వచ్చాయి. వాటికి, ‘పటాస్’కు మధ్య తేడా ఏంటి..?

స) మాస్ సినిమాలన్నీ ఒకటే ఆర్డర్ లో వెళ్తూ ఉంటాయి. కాకపోతే సినిమా కొత్తగా ఎం చెప్పాం అనేది ఇంపార్టెంట్. సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉంటాయని నేను భావిస్తున్నాను. బాగా డీల్ చేశాడు అని ప్రేక్షకులు కూడా అనుకుంటారు.

ప్రశ్న) బాలకృష్ణ సాంగ్ రీమిక్స్ చేయాలనీ ఎందుకు అనిపించింది..?

స) ఎన్టీఆర్ సాంగ్స్ రీమిక్స్ చేశారు. కానీ, బాలకృష్ణ గారి పాటలను ఎక్కువ రీమిక్స్ చేయలేదు. ‘రౌడీ ఇన్స్పెక్టర్’ పోలీస్ స్టొరీ కాబట్టి, ఆ సినిమాలో సాంగ్ రీమిక్స్ చేస్తే బాగుంటుందని చేశాం.

ప్రశ్న) సినిమాలో హైలైట్స్ ఏంటి..?

స) సాయి కుమార్ గారు నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. విలన్ అసుతోష్ రాణా క్యారెక్టర్ బాగుంటుంది. కమెడియన్స్ ఎమ్మెస్ నారాయణ, శ్రీనివాస్ రెడ్డిలు కామెడీ, సెకండ్ హాఫ్ లో కామెడీ హైలైట్ అవుతుంది.

ప్రశ్న) మీ ఇన్స్పిరేషన్ ఎవరు..? ఎ తరహా సినిమాలంటే మీకు ఇష్టం..?

స) చిన్నప్పటి నుండి జంధ్యాల గారి అభిమానిని. ఆయన సినిమాలు ఎక్కువ చూసేవాడిని. బిటెక్ రోజుల్లో యాక్షన్ సినిమాలపై ఇంటరెస్ట్ పెరింది. యాక్షన్ – కామెడీ జోనర్ సినిమాలు అంటే ఇష్టం. ‘పటాస్’ కూడా యాక్షన్ కామెడీ జోనర్లోనే ఉంటుంది.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు