మరో మెగా వారసుడు.. ‘పవన్ తేజ్’ రాబోతున్నాడు !

Published on Jan 11, 2020 6:00 pm IST

మరో మెగా వారసుడు ‘పవన్ తేజ్ కొణిదెల’ (రామ్ చరణ్ కి తమ్ముడు వరస) హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వనున్నాడు. నూతన దర్శకుడు అభిరామ్ దర్శకత్వంలో పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత రాజేష్ నాయుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌బోతున్నారు. ఈ సినిమాకి ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పెట్టారు. ఎలాగూ ‘కొణిదెల’ అనే బ్రాండ్ నేమ్ ఉంది కాబట్టి పవన్ తేజ్ సినిమా ఆడియన్స్ కు ఈజీగానే చెరువు అవుతుంది.

అయితే పవన్ తేజ్ మాత్రం తన స్వశక్తితోనే ఇండస్ట్రీలో నిలబడటానికి కష్టపడుతున్నాడట. పైగా ‘పవన్ తేజ్’ ఇంతకుముందు ‘ఖైదీ నెం.150’, రంగస్థలం, వాల్మీకి వంటి సినిమాల్లో నటించి నటనలో మెళుకువలు నేర్చుకున్నాడు. ఇక ఈ చిత్రానికి కార్తీక్ సంగీతం అందిస్తుండగా, సునీల్ కుమార్ ఎన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు.

అదేవిధంగా నరేష్ బాబు ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటర్ గా చేస్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ తేజ్ కూడా మెగా వారసులు లాగానే స్టార్ డమ్ తెచ్చుకోవాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :