సైరా లో పవన్ వాయిస్ అధికారికమే…!

Published on Aug 16, 2019 10:11 am IST

రెండు రోజుల క్రితం సైరా నరసింహా రెడ్డి మూవీ మేకింగ్ విడుదల చేశారు.అద్భుత విజువల్స్, ఉత్కంఠరేపే యుద్ధ సన్నివేశాలలతో సైరా మూవీ అభిమానులకు ఓ మంచి అనుభూతి పంచనుందని ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. సైరా నరసింహారెడ్డి పాత్రధారి మెగాస్టార్ చిరంజీవి లుక్ తో పాటు, ఇతర కీలకపాత్రలు చేస్తున్న అమితాబ్, జగపతిబాబు,నయనతార,విజయ్ సేతుపతి,సుదీప్,తమన్నా,నిహారిక పాత్రలను పరిచయం చేశారు.

ఐతే ఆ మేకింగ్ వీడియోలో ఈనెల 20న సైరా టీజర్ ని విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు.కాగా టీజర్ లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందని కొద్దిరోజులుగా ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. సైరా లో చిరంజీవి పాత్ర అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెవుతారని చెప్పడం జరిగింది. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోవడంతో ఇది ఎంత వరకు వాస్తవం అనే అనుమానం ఉంది. ఐతే ఈ అనుమానాలకు తెరదించుతూ పవన్ సైరా కి వాయిస్ ఓవర్ చెప్పారని ధృవీకృతం అయినది.

డబ్బింగ్ థియేటర్లో పవన్ డబ్బింగ్ చెవుతున్న ఓ ఫోటో బయటకి రావడం జరిగింది. దీనితో ఈ విషయం స్పష్టం అయినది. మెగా స్టార్ మూవీ టీజర్ కి పవర్ స్టార్ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది, మెగా ఫ్యాన్స్ ఎంత సంతోషకర వార్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా పవన్ చిత్రాలు మానేసిన తరుణంలో కనీసం తెరపై ఆయన వాయిస్ విని పవన్ ప్యాన్స్ ఆనందించనున్నారు.

సంబంధిత సమాచారం :