“వకీల్ సాబ్”కు తన వర్క్ కంప్లీట్ చేసేసిన పవన్.!

Published on Mar 27, 2021 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” రిలీజ్ కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం విడుదల టైం దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ ను హోరెత్తిస్తున్నారు. అలాగే మరోపక్క పవన్ కూడా తన రోల్ కు సంబంధించిన డబ్బింగ్ ను కొన్ని రోజుల కితమే స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఈ డబ్బింగ్ పార్ట్ ను పవన్ మొత్తం పూర్తి చేసుకున్నట్టుగా దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు తెలిపారు. పవన్ మరియు దర్శకుడు వేణు శ్రీరామ్ ఇతర యూనిట్ సభ్యులతో పవన్ డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫోటో తో కన్ఫర్మ్ చేసేసారు. మరి ఓవరాల్ గా భారీ హైప్ ను సంతరించుకున్న ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టేలానే ఉంది. ఇక ఈ చిత్రంలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం :