టాక్..ఆ సినిమా రీమేక్ తో విస్తుపోతున్న పవన్ ఫ్యాన్స్.?

టాక్..ఆ సినిమా రీమేక్ తో విస్తుపోతున్న పవన్ ఫ్యాన్స్.?

Published on Nov 22, 2022 11:03 PM IST


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమా ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా మరోపక్క మరికొన్ని చిత్రాలు పవన్ ఓకే చేసినవి కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా పవన్ లైనప్ కి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ వార్తలే ఆ మధ్య బయటకి వచ్చాయి.

అయితే వాటిలో ఓ రీమేక్ ఉంది అని ఏమన్నా తెలిస్తే అసలు ఏ సినిమా రీమేక్ చేస్తున్నారు అనేది కూడా తెలీకుండా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇందులో కొంచెం అడ్వాన్స్ గా వెళితే ఆల్రెడీ తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అయ్యిన సినిమాని కూడా మళ్ళీ రీమేక్ చేయనున్నారు అనే టాక్ రావడం అయితే వారిని మరింత కుంగదీస్తుంది..

అయితే గత కొన్నాళ్ల కితం సాహో ఫేమ్ యంగ్ దర్శకుడు సుజీత్ పవన్ లైనప్ లోకి వచ్చాడని కొన్ని రూమర్స్ వచ్చాయి. అది కూడా ఓ రీమేక్ కోసమే అని ఆ చిత్రం ఆల్రెడీ తెలుగులో రిలీజ్ అయ్యిన విజయ్ సినిమా “తేరి” తెలుగులో “పోలీసోడు” అని తెలిసింది.

దీనితో అప్పట్లోనే కంగారు పడ్డ పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అని టాక్ తెలుస్తుండగా అదే సినిమానా అని భయపడుతున్నారు. మరి ఆల్రెడీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన సినిమా పైగా చాలా మందికి కూడా ఆ సినిమా తెలుసు. అయినా మళ్ళీ రీమేక్ చేయడం అంటే అదెందుకో కూడా పవన్ కే తెలియాలి ఇక. లేదా కొత్త ప్రాజెక్ట్ నా అనేది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు