‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ తో పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ !

7th, January 2018 - 09:34:09 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ చిత్ర ట్రైలర్ ను నిర్మాణ సంస్థ హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థ నిన్న అర్థరాత్రి వరకు ఊరించి ఊరించి 1 గంట సమయంలో రిలీజ్ చేసింది. అప్పటివరకు ఎంతాగానో ఎదురుచూసిన అభిమానులు ట్రైలర్ చూసిన తర్వాత ఆ కష్టాన్నంతా మర్చిపోయి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు ట్రైలర్ టాప్ ట్రెండింగ్స్ లోనే ఉందంటే ఆ క్రేజ్ ఏ స్థాయిదో ఇట్టే అర్దమైపోతోంది.

పవన్ స్టైల్, ఫైట్స్, డైలాగ్స్, ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్, డైలాగ్స్ అన్నీ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని ఇంకాస్త పెంచేశాయి. ఈ నెల 10వ తేదీన రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని 17వ తేదీ వరకు రాత్రి 1 నుండి ఉదయం వరకు స్పెషల్ షోస్ వేసుకోవచ్చని ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చేసింది. దీంతో సినిమా ఓపెనింగ్స్ అనుకున్నదానికంటే ఇంకా భారీ స్థాయిలోనే ఉండే అవకాశముంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటించారు.

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి :