పవన్ కోపానికి కారణమైన ఫ్యాన్స్…కారణం ఏమిటంటే?

Published on Dec 9, 2019 7:11 am IST

పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ గతంతో పోల్చుకుంటే కొంచెం సీరియస్ గా పాలిటిక్స్ చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి విధి విధానాలను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆయన మన నుడి, మన నది అనే ఓ కార్యక్రమం ద్వారా తెలుగు భాషా సంస్కృతిని అలాగే నదులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఇక ఈనెల ఒకటి నుండి ఆయన రాయలసీమలో పర్యటిస్తూ వివిధ వృత్తుల వారిని, రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.

కాగా నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో జనసైనికులు ఆయన కోపానికి కారణమయ్యారు. ఆయన ప్రసంగానికి భంగం కలిగేలా వారు కేకలు, ఈలలు వేయడం ఆయనకు కోపం తెప్పించింది. దీనితో పవన్ ఒకింత సహనం కోల్పోయారు. మీకు క్రమశిక్షణ లేకపోవడం వలనే గత ఎన్నికలలో జనసేన ఓటమి చెందిందని ఆయన మండిపడ్డారు. మీ వలన నాకు చాలా ఇబ్బందిగా తయారయ్యింది అని పవన్ మాట్లాడం ఆయనను అంతగా అభిమానించే వారిని విస్మయానికి గురిచేసింది. క్రమశిక్షణ లేకుంటే ఏమీ సాధించలేమని ఆయన వారికి హితవు పలికాడు. ఇక గత కొద్దిరోజులుగా పవన్ ఓ మూవీ చేస్తారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More