పవన్ సినిమాలో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్

Published on Jun 9, 2021 3:01 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైన్ చేసిన సినిమాల్లో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ క్రేజీ ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ మీద అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే వీరిద్దరూ కలిసి గతంలో చేసిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈసారి కూడ అలాంటి సినిమానే ఆశిస్తున్నారు అందరూ. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ మైత్రీ మూవీస్ నిర్మాతలను గట్టిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. సొంత ఎడిట్స్ చేసి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ వదులుతున్నారు. వాటికే సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. దీంతో మైత్రీ నిర్మాతలు స్పందించక తప్పలేదు.

ఉగాది పండుగ రోజునే పవన్ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయాలని అనుకున్నామని కానీ పాండమిక్ సిట్యుయేషన్ మూలంగా రిలీజ్ చేయలేకపోయామని, వాయిదా వేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈసారి పవన్-హరీష్ సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉండదని అన్నారు. నిర్మాణ సంస్థ ఇంత గట్టిగా చెబుతోంది అంటే సినిమాలో హరీష్ శంకట్ ఏదో గట్టి సోషల్ మెసేజ్ ఇవ్వనున్నారని అర్థమవుతూనే ఉంది. ఒకవేళ అది రాజకీయాల గురించి అయినా అయ్యుండొచ్చు. ఇకపోతే ఈ చిత్రంలో చిరు చేసిన ‘ఠాగూర్, మాస్టర్’ చిత్రాల తరహా ట్రీట్మెంట్ ఉంటుందని, పవన్ డ్యూయల్ రోల్ చేస్తారనే ప్రచారం కూడ ఉంది.

సంబంధిత సమాచారం :