సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన పవన్ ‘హాష్ ట్యాగ్’ !

pawan22

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పవర్ స్టార్ పై తమకు ఏ రేంజ్ అభిమానం ఉందో చాటి చెప్పే ప్రయత్నం చేశారు. పవన్ పుట్టినరోజుకు కొద్ది రోజులు ముందు నుంచే ట్విట్టర్, ఫేస్ బుక్ లో ఈ హాష్ ట్యాగ్ #HBDJanaSenaniPawankalyan ను వాడుతూ చివరకి దీన్ని నేషనల్ వైజ్ గా ట్రెండ్ చేశారు.

ఈ సాయంత్రం వరకు ఈ హాష్ ట్యాగ్ ట్విట్టర్ లో 7.5 మిలియన్ల కన్నా ఎక్కువ ఉపయోగించబడింది. దీంతో టాలీవుడ్ స్టార్ హీరోల పై ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన హాష్ ట్యాగ్ ల కంటే పవన్ హాష్ ట్యాగ్ టాప్ లో నిలిచింది. దీన్ని బట్టి పవర్ స్టార్ కి ప్రజల్లో మరియు యువతలో ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం పవన్ సినిమాల నుండి వైదొలిగినప్పటికీ, క్రియాశీల రాజకీయాలకి తనకు తాను అంకితమిచ్చినప్పటికీ పవన్ కి జనాదరణ మాత్రం రోజు రోజుకి పెరుగుతుండటం విశేషం.

Exit mobile version