ఆ దివంగత నేతకు స్మరణగా కోటి రూపాయలు ప్రకటించిన పవన్ కళ్యాణ్.!

Published on Oct 17, 2021 6:00 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో పాటుగా తన రాజకీయ పార్టీ కార్యకలాపాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి రెండు పనులను బ్యాలన్స్ చేసుకుంటూ వెళ్తున్న పవన్ కళ్యాణ్ లో దాన గుణం కూడా ఒకింత ఎక్కువే అని తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈరోజు మరో కోటి రూపాయలు తాను విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.

అయితే ఇందులో వివరాల్లోకి వెళితే అప్పటి ఆంధ్ర ప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి స్మరణీయులు దామోదరం సంజీవయ్య చేసిన సేవలను గుర్తు చేస్తూ కొన్ని అంశాలను మళ్ళీ గుర్తు చేస్తూ పవన్ సంజీవయ్య నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చడానికి తన పార్టీ తరపున 1 రూపాయలు తో ఒక నిధిని ఏర్పాటు చేసి వినమ్రంగా తెలియజేస్తున్నానని ప్రకటించారు.

దీనితో పవన్ పై మరోసారి ప్రశంసలు వస్తున్నాయి. మరి ప్రస్తుతం అయితే పవన్ తన మాస్ చిత్రం “భీమ్లా నాయక్” సినిమా చేస్తూ తర్వాత ‘వీరమల్లు’ షూట్ లో జాయిన్ కానున్నారు.

సంబంధిత సమాచారం :

More