మాస్ పూనకాలు సృష్టించేందుకు “భీమ్లా నాయక్” వస్తున్నాడు.!

Published on Aug 15, 2021 9:48 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన మాస్ సినిమాలు ఒకెత్తు అయితే ఇపుడు చేస్తున్న “అయ్యప్పణం కోషియం” రీమేక్ ఇంకొక ఎత్తు అని చెప్పాలి. ఈ సినిమా పట్ల క్లాత్ క్రేజీగా మాస్ ఆడియెన్స్ ఎదురు చూస్తున్న తరుణంలో మాస్ అడ్రినలిన్ ను మరింత పెంచుతూ మేకర్స్ ఒక్కో అప్డేట్ ఇస్తూ వస్తున్నారు. మరి అలా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాస్ గ్లింప్స్ ను అలాగే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేస్తామని చెప్పుకొచ్చారు.

మరి అలా చెప్పినట్టుగానే ఈ మాస్ పవర్ ఫుల్ స్ట్రాం ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఈ గ్లింప్స్ చూస్తే మాస్ పూనకాలు తెప్పించడం ఖాయం అనిపిస్తుంది. అలాగే పవన్ కూడా నెవర్ బిఫోర్ మాస్ అవతార్ లో అదరగొట్టాడు. అంతే కాకుండా మాస్ డైలాగ్ తో ఊహించని ఫీస్ట్ నే ఇచ్చాడు.. ఇంకా ఈ చిత్రానికి మొదటి నుంచి భారీ రెస్పాన్స్ వచ్చిన “భీమ్లా నాయక్” టైటిల్ నే ఫిక్స్ చెయ్యడం దానిని పవన్ తో చెప్పించడం ఇంకో మాస్ అట్రాక్షన్..

అయితే డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ రేంజ్ లో చూపిస్తాడని ఎవరూ అనుకోని ఉండరు. మొత్తానికి మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ భీమ్లా నాయక్ మాస్ విశ్వరూపంతో పోరు హోరెత్తనుంది అని చెప్పి తీరాలి.. మరి అలాగే వచ్చే సెప్టెంబర్ 2న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వస్తుంది అని కన్ఫర్మ్ చేశారు..

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :