‘గోపాల గోపాల’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించబోయే సినిమా ఇంకా ఏదీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్ 2’ సెట్స్ పైకి వెళ్ళే దశలో ఉంటే పవన్ కళ్యాణ్ హీరోగా దాసరి నారాయణరావు నిర్మాతగా ఓ సినిమా ఉంటుందని ఇది వరకే తెలియజేశాం. ఈ క్రేజీ కాంబినేషన్ లో రానున్న ఈ సినిమా కోసం ‘సర్దార్’ అనే టైటిల్ ని రిజిష్టర్ చేసారని సమాచారం.
ఈ టైటిల్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో హాల్ చల్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ఈ టైటిల్ ని రిజిష్టర్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకి పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘గబ్బర్ సింగ్ 2’ స్క్రిప్ట్ వర్క్ చివరి దశలో ఉంది. బాబీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాని శరత్ మరార్ నిర్మించనున్నాడు.


