పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పీక్ కెరీర్లో వచ్చిన సాలిడ్ హిట్ చిత్రాల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేసిన మెంటల్ మాస్ చిత్రం “బద్రి” కూడా ఒకటి. పవన్ మ్యానిరిజంలు కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ కాగా బద్రి సినిమాకి అయితే అభిమానుల్లో ఒక స్పెషల్ ప్లేస్ ఎప్పటికీ ఉంటుంది. ఇక ఈ సినిమా రీరిలీజ్ కూడా కావాల్సి ఉంది కానీ ఆగింది.
అయితే ఇపుడు మళ్ళీ బద్రి రీరిలీజ్ పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. దీనితో పవర్ స్టార్ మరోసారి అభిమానులని అలరించేందుకు రాబోతున్నాడని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ప్రింట్ పనులే జరుగుతుండగా ఈ చిత్రాన్ని పవన్ బర్త్ డేకి అంటే సెప్టెంబర్ 2కి రిలీజ్ చేసే ప్లానింగ్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై మారిందా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ పర్టిక్యులర్ సినిమా కోసం మాత్రం చాలా మందే మంచి ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.