పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్న సినిమా ‘గోపాల గోపాల’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం కోసం 6.6 లక్షల రూపాయలు ఖరీదు చేసే ‘హ్యోసంగ్ జివి 650 ఆక్విలా ప్రో’ బైక్ ఉపయోగించారు. రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’లో వాడిన బైక్ స్పెషల్ కాంటెస్ట్ నిర్వహించి అభిమానులకు ఇస్తాం అని నిర్మాత ప్రకటించిన నేపధ్యంలో…. పవన్ కళ్యాణ్ బైక్ పై అభిమానుల దృష్టి పడింది. ఇప్పటి నుండి ఓ కన్నేశారు.
ఇటివల కాలంలో స్టార్ హీరోలు తమ సినిమాలలో ఉపయోగించిన బైకులు, కార్లు వేలం వేస్తున్నారు. తద్వారా వచ్చిన డబ్బును సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’లో పవన్ కళ్యాణ్ వాడిన వస్తువులను కూడా వేలం వేశారు. అదే తరహాలో ఈ ‘గోపాల గోపాల’ బైక్ వేలం వేస్తే సొంతం చేసుకోవాలని పలువురు అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కిషోర్ పార్థసాని (డాలి) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. వెంకటేష్ సరసన శ్రియ జంటగా నటిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మాతలు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.


