‘పవన్ కళ్యాణ్’ బర్త్ డేకి స్పెషల్ అప్ డేట్స్ !

Published on Aug 29, 2021 9:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. మరి పవన్ బర్త్ డే నాడు ఏ సినిమా నుండి ఎలాంటి అప్ డేట్ రానుంది అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కలయికలో రానున్న సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుందని తెలుస్తోంది.

అలాగే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ – పవన్ కాంబినేషన్ లో వస్తోన్న ‘హరి హరి వీరమల్లు’ సినిమాకి సంబంధించి కూడా ఓ క్రేజీ అప్ డేట్ వస్తోంది అట. ఇక స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రానున్న సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ పోస్టర్ రాబోతుందట. నిర్మాత రామ్ తాళ్లూరి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నాడు. అదేవిధంగా “భీమ్లా నాయక్” చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ను పవన్ బర్త్ డే నాడు రిలీజ్ అవుతుందట.

సంబంధిత సమాచారం :