
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. పవన్ కళ్యాణ్ మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ సినిమా ఇటీవలే గుజరాత్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ కి అన్ని కార్యక్రమాలను సిద్దం చేసుకుంటోంది ఈ చిత్ర టీం. తాజాగా ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన శరత్ మరార్ ఈ సినిమా కోసం పవన్ ఎంతలా కేర్ తీసుకుంటున్నాడు, ఏమేమి విభాగాలను ఆయన దగ్గరుండి డీల్ చేస్తున్నాడు అనే విషయాలను తెలిపాడు.
‘పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కథ – స్క్రీన్ ప్లే ని దగ్గరుండి చోసుకున్నారు. క్రియేటివ్ పరంగా ఏం మార్పులు జరగాలన్నా ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. అంతే కాకుండా దాదాపు రెండేళ్ళు ఈ సినిమా మీద కూర్చున్నారు, అందుకే సపోర్టింగ్ రోల్స్ అన్నీ చాలా రియలిస్టిక్ గా అనిపించాలని సపోర్టింగ్ పాత్రలన్నిటినీ ఆయనే దగ్గరుండి డిజైన్ చేసారు. అంతే కాకుండా ఈ సినిమాలో 4 మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. అందులో ఇప్పటికి రెండు ఎపిసోడ్స్ షూట్ చేసాం. యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా ఎలా ఉండాలో డిజైన్ చేసి ఇవ్వడమే కాకుండా దానికి తగ్గట్టుగా రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ ని పవన్ గిడ చేసాడు. అలాగే పాటల మూడ్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయ్యే లొకేషన్స్ మరియు సెట్స్ ని కూడా పవన్ దగ్గరుండి చూసుకుంటున్నాడని’ శరత్ మరార్ తెలిపాడు.
పవన్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, సంజన ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

