పవన్ ‘ఓజీ’ షూటింగ్ పై క్రేజీ న్యూస్

పవన్ ‘ఓజీ’ షూటింగ్ పై క్రేజీ న్యూస్

Published on May 12, 2025 2:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజి కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా కెమెరా డిపార్ట్‌మెంట్ సభ్యుడు షేర్ చేసిన ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోజు షూటింగ్ తిరిగి ప్రారంభమైందని టీం సభ్యుడు వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ లేకుండా కొన్ని రోజులు చిత్రీకరణ కొనసాగించారు.

ఐతే, ఈ వారం సెట్స్‌లోపవన్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. దీంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్టు హీరో-విలన్ మధ్య సీన్స్ షూటింగ్ పూర్తి అవ్వాల్సి ఉంది. మరి ఈ సీన్స్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను డివివి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు