
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా హైదరాబాద్ లో జరుగుతూ ఉంది. గబ్బర్ సింగ్ లో లానే ఈ సినిమాలో కూడా కెవ్వు కేక పెట్టిన్చేలా ఓ ఐటమ్ సాంగ్ ఉందని, ఆ ఐటమ్ సాంగ్ లో సౌత్ ఇండియన్ హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ చిందులేయనుందని ఇది వరకే తెలియజేశాం. తాజాగా ఈ చిత్ర టీం ఈ ఐటమ్ సాంగ్ ని షూట్ చెయ్యడానికి టైం ఫిక్స్ చేసింది. ఈ బుధవారం అనగా అక్టోబర్ 30 నుంచి హైదరబాద్ నానక్రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో షూట్ చేయనున్నారు.
ఇప్పటికే ఈ సాంగ్ కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నానక్రామ్ గూడాలో ఓ స్పెషల్ సెట్ ని వేసాడు. దేవీశ్రీ ప్రసాద్ ఇప్పటికే ఈ ఓ సూపర్బ్ ఐటమ్ సాంగ్ ని కంపోజ్ చేసాడని, ఈ పాటలో లక్ష్మీ రాయ్ అందాలతో పటు పవన్ మార్క్ మానరిజమ్స్ తో థియేటర్స్ లో ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేలా తీయనున్నారని ఈ చిత్ర టీం తెలిపింది. పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాకి పవర్ ఫేం బాబీ డైరెక్టర్. హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత ఈ చిత్ర టీం ఓ మేజర్ షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ అండ్ శరత్ మరార్ కలిసి సినిమాని నిర్మిస్తున్నారు.

