ఫోటో మూమెంట్ : ‘ఓజి’ డైరెక్టర్‌కు పవన్ కళ్యాణ్ గిఫ్ట్.. బెస్ట్ ఇదే అంటున్న సుజీత్!

Pawankalayan sujeethi

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దర్శకుడు సుజీత్(Sujeeth) కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్ చిత్రం ‘ఓజి’(OG) బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని సుజిత్ తెరకెక్కించాడు. ఇక అభిమానులు పవన్ కళ్యాణ్‌ని ఎలా అయితే చూడాలని అనుకున్నారో, దర్శకుడు సుజిత్ ఆయన్ను అలాగే చూపెట్టాడు.

పవన్ పవర్‌ఫుల్ యాక్షన్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాతో సుజీత్(Sujeeth) తన సత్తా చాటాడు. తనకు ఇలాంటి భారీ విజయాన్ని అందించిన సుజిత్‌కు పవన్ కళ్యాణ్ తాజాగా ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. సుజిత్‌కు పవన్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ కారును పవన్(Pawan Kalyan) స్వయంగా సుజిత్‌కు అందించారు. తన అభిమాన హీరో నుంచి ఇలాంటి గిఫ్ట్ రావడంతో సుజీత్ సంతోషంలో మునిగిపోయాడు. తనకు ఇదే బెస్ట్ గిఫ్ట్ అంటూ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజీత్‌కు కారు గిఫ్టుగా ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓజి చిత్రంలో పవన్(Pawan Kalyan) సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా థమన్ సంగీతం అందించాడు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version