పవన్ ప్లాష్ బ్యాక్ తో స్టార్ట్ చేస్తాడట !

Published on May 15, 2021 8:50 pm IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తి అయిందని, జులై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఇప్పటికే అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఆగష్టు నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా సినిమాలో ప్లాష్ బ్యాక్ సీన్స్ తీస్తారట. అన్నట్టు ఈ సీన్స్ లో పవన్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడట. ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడట.

ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా సృష్టించిన రికార్డ్స్ పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్స్ గా నిలిచాయి. మరి ఈ సారి వీరి కలయికలో రాబోతున్న సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తోందో చూడాలి. పవన్ మాత్రం ఈ సినిమాలో ఫుల్ మాస్ లుక్‌ లో దర్శనమిస్తాడట. ఇంతకు ముందెన్నడూ కనిపించని లుక్ లో అలాగే డిఫరెంట్ క్యారెక్టర్ లో ఈ సారి పవన్ నటించబోతున్నాడు. అందుకే హరీష్ శంకర్ కూడా, పవన్ తో చేయబోతున్న ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

సంబంధిత సమాచారం :