ఇన్స్టాలో హోరెత్తిన పవన్ పేరు.!

Published on Aug 7, 2020 3:49 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆఫ్ లైన్ అయినా సరే ఆన్ లైన్ అయినా సరే ఉన్నా ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు ఎలాగో ఆఫ్ లైన్ లో సంబరాలు చేసే అవకాశాలు పవన్ తో పాటు ఏ ఇతర హీరోల అభిమానులకు కూడా లేకపోవడంతో ఎంత గట్టిగా చేసినా కూడా సోషల్ మీడియాలోనే తమ అభిమాన హీరో పేరును హోరెత్తిస్తున్నారు.

ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పవన్ పుట్టినరోజు కోసం భారీ ట్రెండ్ లు చేస్తున్నారు.ఇప్పుడు ఈ ప్లాట్ ఫామ్ తో పాటుగా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో పవన్ పేరును హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఏకంగా 1 మిలియన్ పోస్టులు వేసి రికార్డు నెలకొల్పారు.

దీనితో పవన్ మన టాలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో టాప్ 5 లో నిలిచారు. ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే టాప్ 4 లో ఉన్న మిగతా హీరోలకు అధికారికంగా ఇన్స్టాగ్రామ్ ఖాతాలు ఉన్నాయి కానీ పవన్ ఎలాంటి అధికారిక లేదు. అంటే ఇదంతా అక్కడ పవన్ లేకుండానే జరిగింది. దీనితో ఇన్స్టాలో కూడా పవన్ క్రేజ్ గట్టిగానే ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More