పవన్ రంజాన్ వేడుకను సింపుల్ గా ముగించేశాడుగా.

Published on Jun 6, 2019 10:40 am IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రంజాన్ వేడుకలను హైదరాబాద్ లో అతి సాధారణంగా జరుపుకున్నారని సమాచారం. ఎన్నికల్లో ఆశించినంతగా రాణించక పోవడంతో పవన్..ఫలితాల అనంతరం రెండు రోజులు పార్టీ నేతలతో కార్య కర్తలతోకలిసిన పవన్. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. గత కొన్ని రోజులుగా .పవన్ రాజకీయ పరిణామాలపై అంతగా స్పందించడం లేదు.

నిన్న పవన్ కళ్యాణ్ రంజాన్ వేడుకలు అతిసాధారణంగా కొద్దీ మందితో జరుపుకున్నట్లు సమాచారం.కేవలం కొన్ని ముస్లిం కుటుంబాలతో కలిసి ఆయన జరుపుకున్న వేడుక తాలూకా ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి.ఓ హీరోగా ఇలాంటి వేడుకులకు అంత ఆర్భాటం అవసరం లేదు కానీ, పార్టీ నాయకుడిగా ఇలాంటి విషయాలలో కొంచెం హంగు ఆర్బాటం అవసరం కదా.

కాగా త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న స్థానిక ఎన్నికల కొరకు పవన్ సమాయత్తం అవుతున్నారు. ఈరోజు నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులతో పవన్‌కళ్యాణ్‌ భేటీ కానున్నారు.

సంబంధిత సమాచారం :

More