మేనల్లుడి కోసం రివ్యూ చదివిన పవన్ కళ్యాణ్..!

మేనల్లుడి కోసం రివ్యూ చదివిన పవన్ కళ్యాణ్..!

Published on Nov 17, 2014 3:28 PM IST

pawan-kalyan-saidarm-teja
సాధారణంగా పవన్ కళ్యాణ్ తన సినిమా రివ్యూలను పట్టించుకోరు. మొదటిసారి తన మేనల్లుడి కోసం ‘పిల్లా నువ్వులేని జీవితం’ రివ్యూలను చదివారు. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. ఈ మెగా మేనల్లుడు హీరోగా ప్రేక్షకులకు పరిచయమైనది ఈ సినిమాతోనే. మొదటి సినిమాతోనే హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు.

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమా చూడలేదు. విడుదలైన రెండవ రోజు ఇంటికి వెళ్లి కలిశాను. బాగా చేశావంట కదా. రివ్యూలు చదివాను. అందరు బాగా చేశాడు అని చెప్తున్నారు. గుడ్, కీప్ డూయింగ్ హార్డ్ వర్క్ అంటూ అభినందించారు. అని సంతోషంగా చెప్పారు.

డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. రవి కుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజినా హీరోయిన్. జగపతి బాబు మైసమ్మ పాత్రలో నటించారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు. అల్లు అరవింద్, దిల్ రాజుల సమర్పణలో బన్ని వాసు, హర్షిత్ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.

తాజా వార్తలు