పవన్ సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాడట !

పవన్ సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాడట !

Published on Jul 3, 2022 10:51 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ సినిమా ‘హరిహర వీరమల్లు’. అయితే, ఈ సినిమా షూటింగ్ చాలా స్లోగా సాగుతుంది. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా అనుకున్న సమయానికి షూట్ ను ఫినిష్ చేసుకోలేకపోయింది. అయితే, ఈ సినిమా కోసం పవన్ వచ్చే నెలలో బల్క్ డేట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ ను మొత్తం సింగిల్ షెడ్యూల్ లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేయమని పవన్.. క్రిష్ కి సూచించాడట.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు