మన టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వచ్చి దగ్గరగా మూడేళ్లు కావస్తోంది. మరి ఆ గ్యాప్ ను తాను లేటెస్ట్ గా నటిస్తున్న “వకీల్ సాబ్” కు గాను ఏకంగా ట్విట్టర్ లో మోస్ట్ ట్వీటెడ్ తెలుగు సినిమాగా సెట్ చేసేసారు పవన్ అభిమానులు.
పవన్ కం బ్యాక్ సినిమా కావడంతో ఆ హై ను మైంటైన్ చేస్తూ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అన్ని కరెక్ట్ గా ఉండి ఉంటే ఈపాటికే సినిమా విడుదల జరిగిపోయి ఉండేది. కానీ అలా జరగలేదు, మరి ఈ గ్యాప్ లో పెద్ద చెప్పుకోదగ్గ అప్డేట్స్ కూడా రాలేదు. దీనితో సినిమా విడుదల పట్ల చాలానే మిస్టరీ నడిచింది.
ఒకానొక సమయంలో సంక్రాంతి కి వచ్చేస్తుంది అని టాక్ వచ్చింది కానీ కూడా ఆగింది. మరి ఫైనల్ గా మేకర్స్ ఈ చిత్రాన్ని గత ఏడాది మిస్ చేసిన వేసవి విడుదలకే ప్లాన్ చేస్తున్నారని టాక్. సో వకీల్ సాబ్ ఆగమనం అప్పటికి ఫిక్స్ అవ్వొచ్చు..ఇక ఈ చిత్రాన్ని ఏమాత్రం అంచనాలు తగ్గకుండా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.


