హరికృష్ణ ఫ్యామిలీకి సంతాపం తెలియజేసిన పవన్ కళ్యాణ్

హరికృష్ణ ఫ్యామిలీకి సంతాపం తెలియజేసిన పవన్ కళ్యాణ్

Published on Dec 7, 2014 11:59 AM IST

Pawan-Kalyan

నిన్న సాయంత్రం అకస్మాత్తుగా జరిగిన ఓ సంఘటన వలన నందమూరి ఫ్యామిలీ మొత్తం శోఖ సముద్రంలో మునిగిపోయింది. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి చెందిన నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు తీవ్రమైన బాధకి లోనయ్యారు. దానికి కారణం ననదమోరి హరికృష్ణ పెద్ద కుమారుడైన నందమూరి జానకిరామ్ నిన్న సాయంత్రం యాక్సిడెంట్ లో మృతి చెందడమే.. ఈ విషయాన్ని మీము ఇది వరకే తెలియజేశాము.

ఈ రోజు ఉదయం నుంచి సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న హరికృష్ణ ఇంటికి చేరుకొని జానకిరామ్ కి నివాళులర్పించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తదితరులు జానకిరామ్ కి నివాళులర్పించారు. ఇలాంటి విషయాలను ముందుగా చలించిపోయే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం షూటింగ్ లో భాగంగా వారణాసిలో ఉండడం వలన ఇక్కడికి రాలేకపోవడంతో హరికృష్ణ కుటుంబ సభ్యులకు మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేసారు.

‘నందమూరి జానకిరామ్ మరణ వార్త విని నా మనసు చలించిపోయింది. హరికృష్ణ గారికి, కళ్యాణ్ రామ్ గారికి, జు. ఎన్.టి.ఆర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాని’ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈ రోజు సాయంత్రం మొహినాబాద్ ఫాం హౌస్ లో నందమూరి కళ్యాణ్ రామ్ దహన కార్యక్రమాలు జరగనున్నాయి.

తాజా వార్తలు