జింలో వర్క్ అవుట్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్.

జింలో వర్క్ అవుట్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్.

Published on Sep 6, 2014 2:51 PM IST

pawan-kalyan
బెంగుళూరులో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జింలో వర్క్ అవుట్స్ చేస్తున్నారు. ఫిట్నెస్ పై శ్రద్ధ వహించారు. గత కొంత కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఇటివలే సర్జరీ చేయించుకున్నారని సమాచారం. ఫిజియోతెరఫీతో పాటు వర్క్ అవుట్స్ పై దృష్టి పెట్టారని ఫిల్మ్ నగర్ సమాచారం.

త్వరలో పవన్ కళ్యాణ్ వెంకటేష్ తో కలసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘గోపాల గోపాల’ షూటింగ్లో పాల్గొంటారు. ‘అత్తారింటికి దారేది’ ఘనవిజయం తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో పవన్ మోడరన్ శ్రీకృష్ణుడిగా నటిస్తున్నారు.

తాజా వార్తలు