పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం నుంచి న్యూస్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆయన అచ్చ తెలుగు సాంప్రదాయమైన పంచె కట్టులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలవడానికి విజయవాడ వెళ్ళాడు. ఆయన పంచె కట్టులో వెళ్ళడం అందరినీ సర్ప్రైజ్ చేయడమే కాకుండా న్యూస్ లో ఎక్కువగా నిలిచింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ సడన్ గా ఎందుకు ఇలా పంచె కట్టులో కనిపించాడు అనే విషయాన్ని ఆయన సన్నిహితులు ద్వారా తెలుసుకున్నాం.
పవన్ సన్నిహితులు చెప్పిన సమాచారం ప్రకారం ‘ ఈ రోజు నుంచి ప్రారంభమైన కార్తీక మాసం దీక్షని పవన్ కళ్యాణ్ కూడా ప్రారంభించాడు. అందులో భాగంగానే ఆయన ఈ రోజు ఉదయమే పూజా కార్యక్రమాలను పూర్తి చేసి ఆ తర్వాత ఆయన ఇంటినుంచి విజయవాడ బయలు దేరాడు. ఈ 45 రోజులు ఆయన దీక్షలో ఉంటాడు. అందులో భాగంగా ఈ దీక్ష పూర్తయ్యేంతవరకూ ఒకపూట మాత్రం భోజనం చేయనున్నాడని’ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ నెల 17న ఈ చిత్ర టీం ఓ మేజర్ షెడ్యూల్ కోసం గుజరాత్ వెళ్లనున్నారు.


