‘ఓజి’ రికార్డు బ్రేక్.. కర్ణాటకలో ‘పెద్ది’ విధ్వంసం!

‘ఓజి’ రికార్డు బ్రేక్.. కర్ణాటకలో ‘పెద్ది’ విధ్వంసం!

Published on Jun 4, 2026 10:08 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే పెద్ది. ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించిన ఈ సినిమా అభిమానులు, జెనరల్ ఆడియెన్స్ మనసులు గెలుచుకుంది. ఇలా గ్రాండ్ గా ప్రీమియర్స్ తో విడుదల అయ్యిన ఈ సినిమా పవన్ ఓజి రికార్డుని కన్నడ గడ్డపై బ్రేక్ చేసినట్టు తెలుస్తుంది.

లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం ఓజి సినిమా ప్రీమియర్స్ తో కర్ణాటకలో 2.7 కోట్లకి పైగా గ్రాస్ ని రాబడితే పెద్ది సినిమాకి మాత్రం ఏకంగా 3 కోట్లకి పైగా గ్రాస్ వసూలు అయ్యి ఆల్ టైం రికార్డు సెట్ చేసింది. దీనితో టాలీవుడ్ నుంచి విడుదల అయ్యిన అన్ని సినిమాల్లో హైయెస్ట్ ఓపెనర్ గా ఈ సినిమా నిలిచింది. సో ఇక ముందు నుంచి రామ్ చరణ్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి రెహమాన్ సంగీతం అందించగా వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించారు.

తాజా వార్తలు