మరోసారి పాట పాడనున్న పవర్ స్టార్?

మరోసారి పాట పాడనున్న పవర్ స్టార్?

Published on Dec 9, 2015 8:31 AM IST

Sardaar-Gabba-Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పోలీస్ ఎంటర్టైనర్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ప్రస్తుతం ఈ చిత్ర టీం గుజరాత్ లోని రాజ్ కోట్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేసుకొని హైదరాబాద్ వచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి దీవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవీశ్రీ తన ప్రతి సినిమాలోనూ ఎక్కువ భాగం హీరో చేత ఓ బిట్ సాంగ్ అన్నా పాడించడానికి ట్రై చేస్తుంటాడు. అలానే ఇప్పుడు దేవీశ్రీ పవన్ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ తో మరోసారి పాత పాడించడానికి సిద్దమవుతున్నాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ లో సందర్భానుసారంగా వచ్చే ఓ స్పెషల్ సాంగ్ ని దేవీశ్రీ కంపోజ్ చేసాడు. ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ చేత పాడించాలని ఆయన్ని అప్రోచ్ అయితే, పవన్ సముఖంగానే ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ వాయిస్ మరోసారి పాటలో కూడా వినచ్చు. పవన్ కళ్యాణ్ గతంలో తమ్ముడు, జానీ సినిమాలలో పాటలు పాడాడు. రీసెంట్ గా అత్తారింటికి దారేది సినిమాలో పాడిన కాటమ రాయుడా సాంగ్ పాడారు. ఆ సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. మరి పవన్ పాట పాడబోయే విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు