మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘మెగా 158’ గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం చేసుకున్నాడు. గతంలో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం తర్వాత దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమం రేపు(మే 21) హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం విశేషం. మెగా బ్రదర్స్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించనుండటంతో ఈ శుభకార్యక్రమానికి టాలీవుడ్‌లో ఎనలేని క్రేజ్ పెరిగింది. అభిమానుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రం కోసం ఇప్పటికే ఒక అద్భుతమైన సాంకేతిక బృందాన్ని ఎంపిక చేశారు. సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తీక్ కణ్ణన్, సంగీత దర్శకుడిగా స్టార్ కంపోజర్ థమన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా బాధ్యతలు చేపట్టనున్నారు. రేపు జరిగే పూజా కార్యక్రమం అనంతరం ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.


