ఆగస్టు నుండి పవన్ – హరీష్ సినిమా !

ఆగస్టు నుండి పవన్ – హరీష్ సినిమా !

Published on Jun 7, 2021 8:27 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక అప్ డేట్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఆగస్టు నుండి ఈ సినిమా కోసం డేట్స్ ఇచ్చాడని తెలుస్తోంది. ఆగస్టు నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా కోసం నెలకు పది రోజుల చొప్పున పవన్ డేట్స్ ఇస్తాడట. ఇక ఈ సినిమాలో పవన్ ప్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్లాష్ బ్యాక్ లో వచ్చే తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవన్ రెండు పాత్రల్లో కనిపిస్తాడట.

కాగా తండ్రి పాత్రది పోలీస్ ఆఫీసర్ పాత్ర అట. ఇక గతంలో హరీష్, పవన్ కాంబినేషన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. అప్పటికే వరుస ప్లాప్స్ లో ఉన్న పవన్.. గబ్బర్ సింగ్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. మరి ఈ సారి కూడా ఈ క్రేజీ కాంబినేషన్ నుండి వచ్చే సినిమా రికార్డ్స్ ను సృష్టిస్తోందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు