సెట్స్ మీదకు పవన్.. ఎప్పుడంటే..

Published on Jun 7, 2021 6:08 pm IST

రీఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచారు. ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఆయన స్పీడుకి బ్రేకులు వేసింది. అన్ని సినిమాలతో పాటు పవన్ చేస్తున్న రెండు చిత్రాలు నిలిచిపోయాయి. పవన్ సైతం కరోనా బారినపడ్డారు. దీంతో అన్ని సినిమాలు మొదలవుతున్నా పవన్ సినిమాల విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. ఇప్పుడప్పుడే ఆయన సెట్స్ మీదకు రారని వార్తలు వచ్చాయి. అయితే పవన్ మాత్రం తిరిగి పనిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారట. షూటింగ్ రీస్టార్ట్ చేసుకొమని తన దర్శకులకి చెప్పారట.

ఈ నెల మధ్య నుండి క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ‘హరి హర వీరమల్లు’ రీస్టార్ట్ కానుంది. జూన్ నెలాఖరు నుండి పవన్ షూటింగ్లో పాల్గొననున్నారు. అలాగే వచ్చే నెలలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న రీమేక్ సినిమాను మొదలుపెడతారట. మునుపటిలాగే ఈ రెండు చిత్రాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకోనున్నాయి. అలాగే ఆగష్టు నెల నుండి హరీష్ శంకర్ సినిమాను కూడ మొదలుపెడతారు పవన్. సో.. ఇంకో రెండు రెండు నెలల్లో పవర్ స్టార్ సినిమాలు మూడు సెట్స్ మీద ఉండనున్నాయి.

సంబంధిత సమాచారం :