లెజెండరీ నటుడు పేరుపై పవన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ .

Published on Jun 30, 2019 8:41 pm IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీనియర్ రాజకీయనాయకులైన మాజీ ఎంపి హరి రామ జోగయ్యగారు అస్వస్థత చెందడంతో ఆసుపత్రిలో ఉన్న ఆయన్ని స్వయంగా కలిసి ఆరోగ్యంపై ఆరాతీసారు. అలాగే ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షించారు.ఈయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి,ఆ పార్టీకీ అండగా నిలబడ్డారు.

ఈ సందర్భంగా పవన్ ఓ కీలక ప్రకటన చేశారు. పాలకొల్లులో శ్రీ ఎస్ వి రంగారావు స్మారక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ని జనసేన పార్టీ నేతృత్వంలో నెలకొల్పనున్నారట. దీనికి చైర్మన్ గా రామజోగయ్య వ్యవరిస్తారట, రాజా వన్నెం రెడ్డి,బన్నీ వాసు నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్ లో నటన,దర్శకత్వ విభాగాలలో ఇస్తారట. దీనికి సంబందించిన శిక్షణా సిబ్బంది,టీచింగ్ విధానం అన్ని సిద్దమైపోయాయట. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా త్వరలో ప్రారంభం కానుందని సమాచారం.

సంబంధిత సమాచారం :

More