భారీ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసిన పవన్ కళ్యాణ్ !

Published on Apr 3, 2020 3:15 pm IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న క్రమంలో.. కరోనా పై పోరాటంలో భాగంగా ఈ సంక్షోభ సమయంలో కరోనా వైరస్ బాధితుల సహాయార్థం కొరకు పలువురు ప్రముఖలు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే అందరి కంటే ముందుగా పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయిలను, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలను, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి మరో రూ.50లక్షలను విరాళంగా ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా పవన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన బ్యాంక్ అకౌంట్‌ కు రూ.కోటి రూపాయిలను ట్రాన్స్‌ఫర్ చేశారు, అలాగే, ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.50లక్షలను, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌ కు రూ.50లక్షలను ఆయా బ్యాంక్ ఎకౌంట్స్ కు పవన్ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.

మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రూప్స్ ను కూడా పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ‘కరోనా వైరస్ పై యావత్ భారతదేశం చేస్తున్న పోరాటానికి మనవంతు ఆర్థిక చేయూతను అందిద్దాం. మరింత బలంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పోరాడేందుకు ప్రధానిమంత్రికి చేయూతను అందించి మన నైతిక బాధ్యత నిర్వర్తిద్దాం.’ అని పవర్ స్టార్ జనసేన అధినేత పోస్ట్ చేసారు.

సంబంధిత సమాచారం :

X
More