పవన్ కళ్యాణ్ ఒక డైనమైట్..కితాబిచ్చిన విజయేంద్ర ప్రసాద్.!

Published on Jun 1, 2021 12:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ క్రేజ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భయంకరమైన మాస్ ఫాలోయింగ్ పవన్ సొంతం.. మరి అలాంటి పవన్ విషయంలో భారతీయ సినిమా దగ్గర అద్భుతమైన కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈటీవీలో ప్రసారం అయ్యిన ఆలీతో సరదాగా ప్రోగ్రాం తాజా ఎపిసోడ్ లో తెలిపారు.

ఒక్కో హీరోకి ఎలాంటి కథను అయితే మీరు రాస్తారు అనే ప్రశ్నకి పవన్ వంతు వచ్చినపుడు ఆ ఆసక్తికర పాయింట్స్ చెప్పారు. పవన్ కి అయితే కొత్తగా కథ అసలు అవసరమే లేదని అతన్ని చూడ్డానికే ప్రజలు థియేటర్స్ కి వెళతారని, ఆయన చేసిన సినిమాల్లోనే ఒక్కో సినిమాలో ఒక్కో ముక్క తీసుకొచ్చి పాటలు ఫైట్స్ పెట్టేస్తే చాలని పవన్ కళ్యాణ్ ఒక డైనమైట్ లాంటి వాడని చిన్న నిప్పురవ్వ అతనకి చాలని ఈ గ్రేట్ రచయిత కితాబిచ్చారు.

సంబంధిత సమాచారం :