తుఫాన్ భాదిత ప్రాంతాలలో బుధవారం పవన్ కళ్యాణ్ పర్యటన.

తుఫాన్ భాదిత ప్రాంతాలలో బుధవారం పవన్ కళ్యాణ్ పర్యటన.

Published on Oct 14, 2014 8:53 PM IST

Pawan
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖ, ఉత్తరాంద్ర వెళ్తున్నాట్టు పవన్ సన్నిహితుడు, నిర్మాత శరత్ మరార్ ప్రకటించారు. అక్కడి ప్రజలకు అండగా ఉన్నాను అని తన మద్దతు తెలపడానికి తుఫాన్ భాదిత ప్రాంతాలలో పర్యటించనున్నారు.

ఈ రోజు ఉదయం హుదూద్ తుఫాను బాధితులకు పవన్ కళ్యాణ్ 5౦ లక్షల రూపాయల తక్షణ సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. విరాళాన్ని చెక్కు రూపంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అందించనున్నారు. అలాగే అభిమానులకు సహాయక చర్యలలో పాల్గొనాలని పవన్ పిలుపునిచ్చారు. ఇతర సినిమా హీరోలు కూడా ఈ విపత్కర పరిస్థితులలో స్పందించిన తీరు హర్షణీయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు