అప్పుడు నుంచి స్టార్ట్ చేయనున్న పవర్ స్టార్.!

Published on Jun 15, 2021 9:01 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న పలు కేజ్రి ప్రాజెక్ట్స్ లో అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా కరోనా తీవ్రత పెరగడంతో అలాగే పవన్ కి కూడా కరోనా రావడంతో కొన్నాళ్ళు షూటింగ్స్ వాయిదా వేసేసారు.

ఇక మళ్ళీ ఇప్పుడు అంతా సెట్ అవుతున్న నేపథ్యంలో పవన్ షూటింగ్స్ కి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. అందులో ముందుగా అయ్యప్పణం నే స్టార్ట్ చేసే అవకాశం ఉందని బజ్.. మరి అలా లేటెస్ట్ బజ్ ప్రకారం పవన్ వచ్చే జూలై మొదటి వారంలో అలా ఈ చిత్రం ను స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సాలిడ్ చిత్రంలో మరో కీలక పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగే త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. ఇక థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :