‘వకీల్ సాబ్’ ఆగష్టుకు షిఫ్ట్ అయినట్లేనా ?

Published on Apr 8, 2020 3:00 am IST

కరోనా మహమ్మారి దెబ్బకు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియకుండా పోయింది. దర్శకనిర్మాతలు పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి ఆ దిశగా ముందుకు వెళ్తున్న క్రమంలో సడెన్ గా కరోనా వచ్చి సినిమా ఇండస్ట్రీని స్తంభింప చేసేసింది. దాంతో సినిమాలన్ని పోస్ట్ ఫోన్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ను మొదట మే 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అవ్వాల్సిన పరిస్థితి.

తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌ లో వినిపిస్తోన్న న్యూస్ ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ఆగష్టు నెలకు పోస్ట్ ఫోన్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఈ వార్తకు సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పవన్ రీఎంట్రీ సినిమాని ఎప్పుడెప్పుడూ చేద్దామా అని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులకు మాత్రం ఈ వార్త బాగా నిరాశ పరిచేదే. ఇక దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ సమర్పిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More