ఇక్కడ కూడ పవన్ పోరాటాలే

Published on Feb 22, 2021 7:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో క్రిష్ చిత్రం కూడ ఉంది. ఈ సినిమా చారిత్రిక నేపథ్యంలో ఉండనుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు నిర్మాత ఏ.ఎం.రత్నం. ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చిత్రీకరణతో పాటు ఈ సినిమా చిత్రీకరణ కూడ జరుగుతోంది. ఈ చిత్రీకరణ కోసం 17వ శాతాబ్దపు కాలాన్ని గుర్తుచేసేలా భారీ సెట్ రూపొందించారు.

ఇందులోనే షూటింగ్ జరుగుతోంది. రీమేక్ సినిమా చిత్రీకరణను ఎలాగైతే పోరాట సన్నివేశాలతో మొదలుపెట్టారో ఈ సినిమా చిత్రీకరణను కూడ అలాగే యాక్షన్ సన్నివేశాలతోనే మొదలుపెట్టారు టీమ్. ప్రజెంట్ హై యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందిస్తున్నారు. ఈ పిరియాడిక్ మూవీలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా బాలీవుడ్ నటీనటులు పలువురు కీరోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలు నడుస్తున్నా ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. ఇకపోతే పవన్ పూర్తిచేసిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :