“వకీల్ సాబ్”లో స్పెషల్ అట్రాక్షన్ గా పవన్ లుక్స్.!

Published on Apr 3, 2021 8:57 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ చిత్రం పింక్ కు రీమేక్ గా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించారు. అయితే మొదట్లో పెద్దగా అంచనాలు పెట్టుకోని పవన్ అభిమానులు ఇప్పుడు భారీ స్థాయిలో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎంత కంటెంట్ ఓరియెంటెడ్ అయినా మొదటగా అంతా పవన్ ప్రెజెన్స్ కోసమే ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో మాత్రం పవన్ ఫ్యాన్స్ కు జస్ట్ పవన్ లుక్స్ తోనే సాలిడ్ ట్రీట్ ఉందనున్నట్టు మళ్ళీ తెలుస్తుంది. ఎలా లేదన్న పవన్ ఇందులో మూడు షేడ్స్ లో కనిపించనున్నారు. ముఖ్యంగా ఫుల్ గడ్డంలో ఉన్న లుక్స్ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నట్టు అర్ధం అవుతుంది.

లేటెస్ట్ గా బయటకొస్తున్న కొన్ని ఆఫ్ లైన్ పోస్టర్స్ మరింత హైప్ పుట్టిస్తున్నాయి. ఇలా పవన్ లుక్స్ పరంగా మాత్రం మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో అనన్య నాగళ్ళ, నివేతా థామస్ మరియు అంజలిలు కీలక పాత్రల్లో నటించగా థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రం భారీ ఎత్తున వచ్చే 9న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :