“అయ్యప్పణం” రీమేక్ లో పవన్ మార్క్ ట్రీట్ ఉందట.!

Published on Jun 14, 2021 8:00 am IST

పవర్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ క్రేజీ రీమేక్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్.. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో స్ట్రాంగ్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే మరి చాలా మేర షూటింగ్ కంప్లీట్ చేసుకున్న చిత్రంపై లేటెస్ట్ ఇన్ఫో బయటకి వచ్చింది.

ఈ చిత్రంలో పవన్ మార్క్ ట్రీట్ ఉందట.. ఇప్పటి వరకు కూడా పవన్ చాలానే సినిమాల్లో అదిరే జానపద గేయాలు పాడి అదరగొట్టారు. మరి అలా ఈ చిత్రంలో కూడా పవన్ ఒక పాట పాడినట్టు ఈ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తెలపడం వైరల్ అయ్యింది.

అలాగే పవన్ నుంచి పాట ఒకటే కాకుండా బహుశా ఆ నెంబర్ ఇంకా ఉండొచ్చని కూడా తెలిపాడు. దీనితో ఈ చిత్రంపై మరింత క్రేజ్ ఏర్పడింది. మరి థమన్ మ్యూజికల్ లో ఎలాంటి పాటను పవన్ వినిపించబోతున్నారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం :