గబ్బర్ సింగ్ ని మించేలా పవన్ సినిమా ప్లాన్ చేస్తున్న స్టార్ డైరెక్టర్ ?

Published on Jan 27, 2023 2:31 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ 2012 లో రిలీజ్ అయి ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. హిందీ మూవీ దబాంగ్ కి రీమేక్ గా రూపొందిన ఈమూవీ లో పవన్ కళ్యాణ్ యాక్టింగ్, స్టైల్, స్వాగ్ ఇలా అన్ని కూడా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. పవన్ కి పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ ఆ విధంగా అందరినీ ఆకట్టుకునే రీతిలో గబ్బర్ సింగ్ మూవీని తెరకెక్కించారు. ఇక మళ్ళి దాదాపుగా పదేళ్ల విరామం తరువాత మరొకసారి పవన్ కళ్యాణ్ తో కలిసి హరీష్ శంకర్ చేస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.

తమిళ మూవీ తేరి కి అఫీషియల్ రీమేక్ గా రూపొందనుంది ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఇది రీమేక్ కావడంతో కొందరు పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ ఎలా తెరకెక్కుతుందో అంటూ అనుమనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందిస్తున్న దశరథ్ మాట్లాడుతూ, ముఖ్యంగా మేము తేరి మూవీ యొక్క కథాంశాన్ని మాత్రమే తీసుకున్నామని, మిగతాది అంతా ఇక్కడ మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మారుస్తున్నట్లు ఆయన చెప్పారు. అలానే దర్శకుడు హరీష్ శంకర్, గతంలో పవన్ తో తీసిన గబ్బర్ సింగ్ ని మించేలా ఇందులో ఆయన పాత్రని మరింత పవర్ఫుల్ గా రాసుకోవడంతో పాటు డైలాగ్స్, సాంగ్స్, యాక్షన్, ఫైట్స్ వంటి అన్ని అంశాల విషయమై పక్కాగా శ్రద్ద తీసుకుని తెరకెక్కించనున్నారని, తప్పకుండా ఈ మూవీ అందరి అంచనాలు అందుకుంటుందని టాలీవుడ్ బజ్. కాగా ఈ మూవీ త్వరలో పట్టాలెక్కనుంది. దానికి సంబందించిన పూర్తి అప్ డేట్స్ అతి త్వ రలో అధికారికంగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం :