జస్ట్ మేకింగ్ తోనే హై ఎనర్జీ..అప్డేట్ ఇచ్చిన పవన్ – రానా టీం.!

Published on Jan 26, 2021 12:02 pm IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ లలో మళయాళ రీమేక్ అయ్యప్పణం కోషియం కూడా ఒకటి. యువ దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే మరి జస్ట్ అనౌన్సమెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్ కు త్రివిక్రమ్ కూడా ఒక కీలక పాత్రను అందిస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో ప్రతీ అప్డేట్ ను డే టు డే చెప్తున్నా మేకర్స్ నుంచి ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. జస్ట్ మేకింగ్ వీడియోను వదిలి హై ఎనర్జీ ఇచ్చారు.

పవన్ సెట్స్ లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి త్రివిక్రమ్ తో కలిసి నడిచే వరకు దానికి తోడు థమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో హై ను ఇచ్చాయి. ఇక ఇదే అనుకుంటే మరో సాలిడ్ అప్డేట్ ను వీరు ఇందులోనే రివీల్ చేసేసారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చెయ్యనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. మరి ఈ లెక్కన పవన్ ఫ్యాన్స్ కు ఈ ఏడాది డబుల్ జాతరే అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :