“వకీల్ సాబ్”లో పవన్ ఎంట్రీనే అదుర్స్..!

Published on Apr 7, 2021 7:03 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వకీల్ సాబ్” విడుదల కోసం అంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. పవన్ కం బ్యాక్ చిత్రం కావడంతో దీనిపై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా అన్ని పనులు చకచకా ముగించుకొని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో పవన్ రోల్ పై చాలానే ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు అలానే పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ పై టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో పవన్ ఎంట్రీ సీన్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ సింపుల్ గా అయితే తియ్యలేదట. పవన్ ఎంట్రీ అదిరే యాక్షన్ సీక్వెన్స్ తో ఉండనున్నట్టు తెలుస్తోంది. అది కూడా పవన్ మార్క్ స్టైల్ అండ్ యాటిట్యూడ్ లో ఇది ఉండనుందట. మొత్తానికి మాత్రం వకీల్ సాబ్ లో పవన్ ఫ్యాన్స్ సహా మాస్ ఆడియెన్స్ కు కావాల్సిన అంశాలు పుష్కలంగానే దట్టించినట్టు ఉన్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా నివేతా థామస్, అనన్య నాగళ్ల మరియు అంజలీలు కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ 9న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది..

సంబంధిత సమాచారం :